-
కొంత మంది విద్యార్థులు తమకు పీహెచ్డీ చేయాలని ఆసక్తి ఉందని నన్ను సంప్రదించారు. ఇంకా చాలా మందికి ఇలాంటి ఆలోచనలు ఉంటాయని నేను నమ్ముతున్నాను. అందుకని వారి కోసం నాకున్న అనుభవం రీత్యా ఇక్కడ చిన్న వ్యాసం రాస్తున్నాను. పీహెచ్డీ చేయాలి అనే నిర్ణయం కంటే ముందు: మీకు సైన్స్ మీద పూర్తిగా ఆసక్తి , మంచి బేసిక్స్ , జ్ఞానం సంపాదించడమే కాక సైన్స్ యొక్క సరిహద్దులను విస్తరింపచేయాలనే తపన, సైన్స్ లో కొత్త కోణాలను అన్వేషించాలని…
-
తప్పకుండా వర్షిచే మేఘాలు మరియు వర్షించని మేఘాల రంగులు వేరే వేరుగా ఉండే అవకాశం ఉంది. ఇందుకు మూల కారణాలు, మేఘం యొక్క ఎత్తు, మేఘంలో ఉన్న ఐస్ మరియు నీటిచుక్కల మోతాదు. ముందుగా మేఘం ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాo: భూమి మరియు సముద్రం ఉపరితలం మీద ఉన్న తేమను గాలి వాతావరణ పై భాగానికి కొన్ని సందర్భాలలో మోసుకెళ్తుంది. తేమ ఆకాశం పై భాగములో ప్రయాణిస్తున్నపుడు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం వలన, తేమ చిన్న చినుకులుగా…
-
ఇస్రో చంద్రయాన్ -2 మిషన్లో పాల్గొన్న శాస్త్రవేత్తలలో దాదాపు 30% మంది మహిళలు ఉండడం మనందరికీ గర్వకారణం. ఈ మిషన్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ మహిళా శాస్త్రవేత్తలు ముత్తయ్య వనితా మరియు రీతూ కరిదా గారు. ముత్తయ్య వనితా గారు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అయితే రీతూ కరిదా గారు ఏరోస్పేస్ ఇంజనీర్. వీరిరువురికి ఇస్రో లో డిప్యూటీ డైరెక్టర్ గా పని చేసిన అనుభవం ఉంది. మన దేశ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ గారు ఫిబ్రవరి 28,…
-
వాతావరణ సూచనలు మీద చాలా జోకులు ఉన్న విషయం వాస్తవమేనండి. కొన్ని సార్లు రాబోయా 24 గంటల్లో భారీ వర్ష సూచన అని టీవిలో చెప్తే, రేపు బాగా ఎండ కాస్తుంది, వర్షం ఆచూకీ కూడా ఉండదు. ఇలాంటివి చాలా సందర్భాలలో మనం గమనించి ఉండొచ్చు. వ్యక్తిగతంగా మనకు అనుభవం అయ్యుండొచ్చు. ఇది కేవలం రాబోయే వాతావరణాన్ని కచ్చితంగా అంచనా వేయలేకపోవడం వలన జరిగే తప్పిదం మాత్రమే. ఇందులో టీవీల్లో వార్తలు చదివే వారి తప్పేమి లేదండో!…
-
రాత్రంతా వెన్నెలలో సేదతీర్చుకున్న ఎర్రమందారం ఉదయాన్నే రెట్టింపు ఉత్సాహంతో సూర్యునివైపు చూడసాగింది. నెమలి పురివిప్పినట్టుగానే, తన ఎర్రని రేకులను విప్పి తన స్నేహితుడైన తేనెటీగకు ఆహ్వానం పంపింది. హరివిల్లును ధరించిన సీతాకోకచిలుక ఎర్రమందారంకు శుభోదయం చెప్పటానికి ఎగురుకుంటూ వచ్చేసింది. ఇంతలో పెరట్లో మొక్కలకు నీళ్లుపోయడానికి వచ్చిన శ్యామల మందారచెట్టుకు నీళ్లుపోస్తూ ఇంతటి అందమైన మందారం పూసిందని సంతోషపడింది. పొలానికి సమయమైంది పోవాలి అని గబా గబా కొడవలి, టిఫిన్ డబ్బా తయ్యారు చేసుకుని ఇంటి బయటకు నడవసాగింది…
-
శాటిలైట్ వ్యవస్థ రాబోయే వాతావరణాన్ని అంచనా వేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అలాగని శాటిలైట్ వ్యవస్థ పూర్తిగా వాతావరణ శాస్త్రం లో ఉన్న సమస్యలన్నీ తీర్చలేదు. శాటిలైట్ వ్యవస్థకు చాలా పరిమితులు ఉన్నవి. అవి ఏంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మన భారత వాతావరణ శాఖ (IMD) మన దేశంలో వాతావరణ అంచనా నివేదికను ఇస్తుంది. వాతావరణ అంచనాను మనం కొన్ని విభాగాలుగా విభజించవచ్చు. అవి, పిక్చర్ క్రెడిట్స్: Weather Satellite Images: If the…
-
నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాస్తికుడ్ని. నాస్తికుడిలా చనిపోతాను అనే విశ్వాసం (confidence) నాకు ఉంది! నాకు సైన్స్ పట్ల ఆసక్తి కూడా ఉంది కనుక ఈ ప్రశ్నకు నాకు సమాధానం ఇవ్వడానికి అర్హత ఉంది అని అనుకుంటున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే తప్ప హేతువాదుల అందరి తరుపున ఇచ్చే సమాధానం కాదు అని మనవి. నేషనల్ జియోగ్రఫీ (2016) లో వచ్చిన ఒక వ్యాసం ప్రకారం “The World’s Newest Major Religion: No Religion”,…
-
“గురుత్వాకర్షణ తరంగాలను గుర్తుంచడం మరియు నమోదుచేయడం మానవ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి అని చాలా మంది ఖగోళ శాస్త్రవేత్తలు చెపుతుంటారు.” అసలు గురుత్వాకర్షణ తరంగం అంటే ఏమిటి? దానిని కనుగొనడం నిజంగా అంత గొప్ప పరిణామమా? గురుత్వాకర్షణ తరంగంను నమోదుచేయడం ద్వారా మనకు ఈ విశ్వం గురించి ఏమి తెలుస్తుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తాను. గురుత్వాకర్షణ శక్తి గురించి న్యూటన్ వివరణ మనందరికీ తెలిసినదే. కొంత నిర్దిష్ట దూరంలో ఉన్న రెండు ద్రవ్యరాశి…





