• నా వివాహం ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జరిగింది. ఆ క్రమంలో జరిగిన కొన్ని విషయాలు నాకు చాలా అర్థరహితంగా అనిపించాయి. అవి ఇక్కడ పంచుకునే ప్రయత్నం చేస్తాను. అయితే నాకు అర్థరహితం అనిపించినంత మాత్రనా అవి నిజంగానే అందరికి అర్థరహితం అని అనిపించక పోవచ్చు, గమనించ గలరు! మీకు కొంచెం నాగురించి చెప్పి, ఈ సమాధానం మొదలుపెడతాను. నేను చిన్నప్పటినుండి హేతువాదిని! హేతువాద ఆలోచనలతోనే బ్రతికాను. కాబట్టి నేను చూసే ప్రపంచం కొంత వేరుగా…

  • విమానాలు దాదాపు ఎక్కువ శాతం తేమ, వర్షం, ఐస్ పదార్దాలు కలిగిఉన్న మేఘాలలోకి వెళ్లకుండా ఫ్లైట్ పాత్ ప్లానింగ్ చేసుకుంటారు. వాతావరణ నిపుణుల సూచన మేరకు Air Traffic Controllers (ATC) పైలెట్స్ కి విమానం దట్టమైన మేఘాలలోకి వెళ్లకుండా ఆదేశాలు ఇస్తుంటారు. అంతే కాకుండా పైలెట్స్ కేబిన్ లో ఉన్న రాడార్ సహాయం తో పైలెట్స్ విమానం దట్టమైన మేఘాలలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ మేఘాలపై నుండి వెళితే వర్షం విమానం మీద కురిసే…

  • విమానం గాలిలో ఆగలేదు. కానీ హెలికాప్టర్ గాలిలో ఆగుతుంది. ఈ రెండు గాలిలో తేలడానికి వాడే ఏరోడైనమిక్స్ సూత్రాలు ఒకటే అయినా, వాటి మెకానిక్స్ మాత్రం వేరు. ఇక్కడ విపులంగా రాసె ప్రయత్నం చేస్తాను. మొదటిగా విమానం ముందుకు వెళ్ళడానికి విమానంలో ఉండే ఇంజన్లు దోహద పడతాయి. కానీ విమానం ఎగరడానికి మాత్రం విమానపు రెక్కలు ఉపయోగపడతాయి. విమానపు రెక్కలు కేవలం విమానం కొంత నిర్దష్ట వేగముతో వెళ్ళినపుడే విమానమును గాలిలో తేలగలిగేలా చేస్తాయి. ఆ వేగాన్ని…

  • నేను కార్ డ్రైవింగ్ జర్మనీ వచ్చాక నేర్చుకున్నాను. ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్ తెచ్చుకోవడం కొంత కష్టమే. కొంత సమయం, డబ్బు, ఓర్పు అవసరమే! కానీ ఒక్కసారి నేర్చుకున్న తరువాత కార్ డ్రైవింగ్ ను ఆనందంగా ఆస్వాదించవచ్చు. మీకు నా డ్రైవింగ్ అనుభవాలు చెప్పే కంటే ముందు ఒక విషయాన్ని పంచుకోవాలి, నేను కార్ డ్రైవింగ్ ఇక్కడ చాలా కస్టపడి నేర్చుకున్న తరువాత ఒకరోజు కార్ నడుపుదామని బయటకు వెళ్ళాను, కానీ పరిస్థితి ఇదిగో ఇలా ఉంది….

  • అవునండి నా జీవితంలో కూడా ఒకడు ఉన్నాడు. వాడు నాకు ఊహ తెలిసిన దగ్గరనుండి నా ప్రియ మిత్రుడు. కానీ వాడిని భరించడం చాలా కష్టం. నేను ఒకటి తలిస్తే వాడు మరొకటి తలుస్తాడు. వాడితో ఎప్పుడు నాకు చిరాకే. ఇంకా వాడి గురించి మీకు చెప్పేకంటే, మా ఇద్దరి మధ్యలో జరిగిన కొన్ని వాదాలు, ప్రతి వాదాలు, సంఘటనలు చెప్తే మీకు బాగా అర్ధం అవుతుంది వాడి గురించి! అలా నేను ఏది తలంచినా వాడు…

  • ఏదైనా వస్తువు మన భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి కారణంగా పైనుండి దాదాపు 9.81 m/s2 త్వరణంతో తన వేగాన్ని పుంజుకుని భూమి మీదకు పడుతుంది. మనం చిన్నపుడు టేబుల్ మీద నుండి పెన్సిల్ పడేసినా, అది నేలకు 9.81 m/s2 త్వరణంతో తన వేగాన్ని పుంజుకుని నేలను చేరుకుంటుంది. మన శరీరం, కొన్ని వేల సంవత్సరాల నుండి పరిణామం చెందుతుతూ, భూమి గురుత్వాకర్షణ త్వరణంను తట్టుకోగలిగే కొంత సామర్ధ్యాన్ని అలవరుచుకుంది. ఈ గురుత్వాకర్షణ త్వరణం సంఖ్య,…

  • పోలీస్ కధనం ప్రకారం : ఇలాంటి ఘటనలు మరియు మన దేశం లో కొన్ని చట్టాలు: మూఢ నమ్మకాలను నిర్ములించే దిశగా మన దేశంలో చట్టాలు: మూఢనమ్మకాల నిర్మూలన చట్టం మన రాష్ట్రంలో ఉందా? : ఈ మూఢనమ్మకాల చట్టాలు సరిపోతాయా? రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చేయాల్సిన పనులు: ఇది మన భావితరాల కోసం, మన పిల్లల కోసం, మానవాళి కోసం, వైజ్ఞానిక భారతం కోసం. ఫుట్‌నోట్స్ [1] మా చేతులతో మేమే చంపుకొన్నామే.. [2] Highly educated couple…

  • కొండ చర్యలు విరిగి పడడానికి కారణం ఏంటి?: ముందుగానే ఇలాంటివి పసిగట్టలేమా? ఫుట్‌నోట్స్ [1] The catastrophic landslide and flood in Chamoli in Uttarakhand [2] Dr Dan Shugar on Twitter [3] Scott Watson on Twitter [4] Dr Dan Shugar on Twitter [5] Uttarakhand glacier burst updates: At least 30 workers trapped in tunnel, rescue efforts on, says official – India News , Firstpost [6] Geology…

“If one does not know to which port one is sailing, no wind is favorable”. — Lucius Annaeus Seneca.